అన్‌స్టాపబుల్-4 ..తొలి గెస్ట్ ఎవరంటే?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ మూడు సీజన్లకు సాలిడ్ రెస్పాన్స్ రావడంతో, ఇప్పుడు నిర్వాహకులు నాలుగో సీజన్‌ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇప్పటికే ఈ షో నాలుగో సీజన్ అతి త్వరలో రాబోతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే, తాజాగా ఈ షోకి సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ షూటింగ్‌ని సోమవారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ షో షూటింగ్‌లో బాలయ్య చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడని సమాచారం.

 అంతేగాక, ఈసారి సరికొత్తగా ఈ షోను బాలయ్య హోస్ట్ చేయబోతున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినపడుతుంది. కాగా, ఈ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కి గెస్టుగా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ సీజన్-4 తొలి గెస్టుగా దుల్కర్ సల్మాన్ ఈ షో కి రానున్నారంట.ఆయనతో పాటు ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు కూడా రావొచ్చనే టాక్ వినపిస్తుంది. ఇక ఈ తొలి ఎపిసోడ్‌‌ని దసరా సందర్భంగా స్ట్రీమింగ్ చేస్తారనే టాక్ నడుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories