ఆశ…నిరాశేనా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా  చేస్తున్న భారీ చిత్రాల్లో “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు దాదాపు షూటింగ్ అంతటినీ పూర్తి చేసేసుకుంది. అయితే ఈ సినిమా కాకుండా మరో సినిమా డైరెక్టర్‌ సుజీత్ తో “ఓజి” కూడా చేస్తున్నాడు.

మరి దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రెండు సినిమాలు నుంచి కూడా సాలిడ్ అప్డేట్స్ పవన్ పుట్టిన రోజు కానుకగా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. వీరమల్లు నుంచి టీజర్ అలాగే ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ పవన్ బర్త్ డే కి గత నెల లాక్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో అవి ఆగిపోయాయి. ఇక వీటిని మళ్లీ దసరా కానుకగా విడుదల చేస్తారు అంటూ ఓ రూమర్ తెగ నడిచింది.

కానీ ఈసారి కూడా పవన్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పేలా లేదని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు నుంచి కూడా దసరా కానుకగా ఎలాంటి మేజర్ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ లేదనే అనిపిస్తోంది. సో పవన్ ఫ్యాన్స్ కి మాత్రం మరోసారి నిరాశ తప్పేలా లేదని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories