ఆ హీరో భోజనం పై ఈ ముద్దుగుమ్మ క్రేజీ కామెంట్స్‌!

హీరోయిన్ మాళవికా మోహనన్‌ కి ‘తంగలాన్‌’ సినిమాతో మంచి హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ సినిమాలతో  ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా సోషల్‌ మీడియాలో తనను ఫాలో అయ్యే నెటిజన్లతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, మాళవికా మోహనన్‌ చెప్పిన సంగతులు ఏంటో తెలుసా.. ‘హైదరాబాద్‌ వచ్చినప్పుడు మీరు ప్రత్యేకంగా తినాలకునే ఫుడ్‌ ఏమిటి ?’ అని ఓ నెటిజన్ ఆమెను అడగగా.. మాళవిక ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. హైదరాబాద్‌లో నేను తిన్న అత్యంత రుచికరమైన ఆహారం ప్రభాస్‌ పంపే ఇంటి భోజనం’ అని క్రేజీగా చెప్పుకొచ్చింది.

ఇంతకీ, మీ ఫేవరెట్‌ ఫుడ్‌ ఏమిటి ? అని మరో నెటిజన్ ప్రశ్నించగా… దానికి సమాధానంగా ‘మా అమ్మ చేతి భోజనం. బ్రౌన్‌ రైస్‌, చేపల కూర, వేపుడు అంటే నాకు ఎంతో ఇష్టం’ అంటూ మాళవిక తెలిపింది. హారర్‌ మూవీ.. ఘోస్ట్‌ పాత్రలో మేం ఎప్పుడు చూస్తాం ? అని మరో ఫాలోవర్ ఓ క్రేజీ పోస్ట్ పెట్టగా.. ‘మరీ అంత ప్రత్యేకంగా అడుగుతున్నారు. మీరు నన్ను దెయ్యంలా ఎందుకు చూడాలనుకుంటున్నారు’ అని మాళవికా మోహనన్‌ అంతే సరదాగా ఎదురు ప్రశ్నించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories