జగన్ తరిమికొడితే.. చంద్రబాబు మళ్లీ తీసుకొస్తున్నారు!

విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగమన పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబునాయుడు తన తొలిపరిపాలన రోజుల్లోనే అనేక ప్రయత్నాలు చేయగా.. రెండో ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు ముద్ర ఉన్న వాటన్నింటినీ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అమరావతిని స్మశానంగా మార్చే కుట్రలతో పాటూ, సింగపూర్ కన్సార్టియంను తరిమికొట్టడం, విశాఖలో అతిపెద్ద లులూ మాల్ రాకుండా తరిమికొట్టడం వీటిలో కొన్ని. విశాఖలో లులు మాల్ రాకుండా జగన్ కుట్రలు అమలు చేసిన తర్వాత.. సదరు లులు మాల్ తెలంగాణకు వెళ్లింది.

అలాంటి నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు… లులు మాల్ పెట్టుబడులను మళ్లీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. ఏపీ పర్యటనలో సీఎం చంద్రబాబుతో చర్చలు సఫల అయినట్టుగా లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసఫ్ ఆలీ ఎక్స్ లో ఒక పోస్టు పెట్టరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో 18 ఏళ్లుగా సుదీర్ఘ సోదర అనుబంధం ఉన్నదని ఆయన చెప్పారు. మొత్తానికి జగన్ వేసిన వినాశనం ముద్రలను చెరిపివేస్తూ కొత్త అద్భుతాలు సృష్టించడానికి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పుడు లులు గ్రూపుతో కుదిరిన ఒప్పందాల మేరకు.. విశాఖలో ఎనిమిది స్క్రీన్లతో పాటు ఐమ్యాక్స్, అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ ఏర్పాటు అవుతుంది. అలాగే విజయవాడ, తిరుపతిల్లో కూడా అంతర్జాతీయ స్థాయి హైపర్ మార్కెట్లను లులు గ్రూపు ఏర్పాటు చేయబోతున్నది. వీటితో పాటు ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

జగన్ పాలన యావత్తూ.. తిరోగమన ఆనవాళ్లతోనే సాగిపోగా.. చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత.. గతంలో తలపెట్టిన పనులు అనేకం మళ్లీ ఊపిరిపోసుకుంటున్నాయి. లులు మాల్ కూడా అలాంటి ప్రయత్నాల్లో ఒక కీలకమైన ముందడుగుగా భావించవచ్చు. గతంలో విశాఖలో మాత్రమే లులు మాల్ ప్లాన్ చేయగా.. ఇప్పుడు దానితో పాటు విజయవాడ, తిరుపతిలో కూడా లులు హైపర్ మార్కెట్లు రాబోతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories