ఫ్రేమ్‌ అదిరిదంతే!

ప్రస్తుతం మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ అంతా కూడా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఫుల్‌  బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వారిలో మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసిన సందర్భం అభిమానులకి ఎంతో ప్రత్యేక సందర్భమే అవుతుంది.

అలా రీసెంట్ గా బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థాన వేడుకల్లో ఒకే స్టేజి పై బాలయ్య, చిరు కలిసిన మెగా మాస్ ఫ్రేమ్ కలిగించిన ఆనందం మామూలుగా లేదు. మరి లేటెస్ట్ గా ఐఫా అవార్డ్స్ లో మరోసారి ఈ మెగా మాస్ ఫ్రేమ్ కుదిరింది. ఈ వేడుకల్లో మెగాస్టార్ తో కలిసి బాలయ్య ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న పిక్ ఒకటి ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

దీంతో ఇది చూసిన మెగా, నందమూరి అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories