గేమ్ ఛేంజర్” మాస్ సాంగ్ కి ముహుర్తం కుదిరింది!

గ్లోబల్ స్టార్, మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కోలీవుడ్‌ మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నమోస్ట్‌ అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్”.  ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఫుల్ స్వింగ్ లో వరుస అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ మరింత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ సెకండ్ సింగిల్ ని ప్రకటించగా.. దానిని ఈ  నెల 30న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే నేడు దీని ప్రోమోని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోమోకి ఇప్పుడు టైం వచ్చేసింది. ఈ మాస్ సాంగ్ ప్రోమోని ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి విడుదల చేస్తున్నట్లు గా తెలిపారు.

మరి ఈ సాంగ్ ప్రోమో విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ 20న సినిమా గ్రాండ్ గా విడుదలకి సిద్దంగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories