మరోసారి గొంతు సవరించిన పవన్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చాలా కాలం తర్వాత షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికలకి ముందే కొన్ని నెలలు ముందే పవన్ షూటింగ్స్ అన్నీ ఆపేయగా మళ్ళీ చాలా నెలల తర్వాత ఈ సెప్టెంబర్ నుంచి తాను షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు ఓజి , హరిహర వీరమల్లు  షూటింగ్స్ ని తాను లైన్ లో పెట్టుకోగా అల్రెడీటీ వీరమల్లు షూటింగ్ లో ఆయన పాల్గొనడం కూడా జరుగుతుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించే క్రేజీ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ సాలిడ్ యాక్షన్ తో పాటుగా ఓ పాట కూడా పాడబోతునట్టుగా ఓ టాక్‌ వినిపిస్తుంది. సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌ వచ్చే సమయంలో అయితే పవన్ చేత పాట పాడించడానికి స్కోప్ ఉందట. దీంతో ఆ సాంగ్ ని ఇప్పుడు కీరవాణి పవన్ తోనే పాడించాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. దీంతో మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ నోట మరో పాట రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories