చిరుకి దక్కిన మరో అరుదైన గౌరవం!

టాలీవుడ్‌ పద్మవిభూఫణుడు మెగాస్టార్‌ చిరంజీవి సెప్టెంబర్‌ 22న గిన్సిన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించింది, చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చిరు తన 46 ఏళ్ల సినీ జీవితంలో 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించి ఈ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా మెగాస్టార్ గుర్తింపు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లోని అబుదాబిలో జరిగిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కూడా మెరిశారు. అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవిని వారు అభినందించారు కూడా. ఈ సందర్భంగా బాలకృష్ణ, చిరంజీవి ఒకరినొకరు కౌగిలించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories