సత్యం సుందరానికి ఏ సర్టిఫికేట్‌ వచ్చిందో తెలుసా!

తమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’ సెప్టెంబర్ 28న తెలుగు లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమా ‘96’ ఫేం దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా పై  ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక రీసెంట్‌గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్‌లోపెద్ద  హాట్ టాపిక్‌ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ‘దేవర’ రిలీజ్ తరువాత రోజున రిలీజ్ చేస్తున్నామని..  దేవర మాస్ ఫీవర్ వీక్షించి ‘సత్యం సుందరం’ క్లాస్‌ను కూడా వీక్షించాలని చిత్ర యూనిట్ ప్రేక్షకులను కోరింది. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ చిత్రం గుడ్ ఫీల్ కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినిమా బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే  విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు కథకు సంబంధించిన కంటెంట్ కూడా సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అరవింద్ స్వామి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తుండగా, సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories