రెండో సాంగ్‌ ప్రోమో ఎప్పుడో మీకు తెలుసా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా…మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబోలో చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ప్రస్తుతం అయితే సినిమా రెండో సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సాంగ్ గా రా మచ్చా మచ్చా అంటూ సాగే సాంగ్ ని ఉదయం ప్రకటించారు. మరి లేటెస్ట్ గా అయితే ఈ సాంగ్ తాలూకా పోస్టర్స్ ని అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. మరి ఇందులో చరణ్ పై గ్రాండ్ సెలబ్రేషన్స్ సాంగ్ లా చరణ్ కూడా మంచి క్లాస్ లుక్స్ లో అదిరేలా కనిపించాడు. మరి తెలుగు సహా తమిళ్ మరియు హిందీ భాషల్లో ఈ సాంగ్ ప్రోమో ని ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా దీనితో రివీల్ చేసేసారు.

మరి థమన్ ఈ సాంగ్ కి ఎలాంటి బీట్స్ ని అందించాడో సినిమాలో చూడాల్సిందే. ఇక ఈ  మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల నటించారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories