వేట్టైయాన్‌ నుంచి హారర్‌ ఎంట్రీ!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టైయాన్  కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

ఈ సినిమాలోని ‘హంటర్ ఎంట్రీ’ అంటూ సాగే సాంగ్‌కి సంబంధించిన ప్రివ్యూని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో రజినీ పాత్రకు సంబంధించిన ఇంట్రో మనకు కనిపిస్తుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ల గురించి ఇచ్చే ఎలివేషన్ మాత్రం అదిరి పోయిందని అభిమానులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారట

‘వేట్టైయాన్’ సినిమాలో ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్, అభిరామి  ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాను దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ‘వేట్టైయాన్’ మూవీ గ్రాండ్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దంగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories