ప్రభాస్‌ తో కొరటాల సినిమా ..ఇది అసలు విషయం!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘దేవర’ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డైరెక్ట్ చేశారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫుల్‌ బిజీగా గడుపుతుంది.

ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘దేవర’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. వాటితో పాటు ఆచార్య, ప్రభాస్‌తో సినిమా వంటి విషయాల గురించి కూడా  కొరటాల మాట్లాడాడు. ‘ఆచార్య’ సినిమా ఫెయిల్యూర్ తరువాత తాను ప్రభాస్‌తో కలిసి మాట్లాడానని.. అయితే, కొన్ని ఐడియాలను ప్రభాస్‌తో తాను పంచుకున్నట్లుగా కొరటాల వివరించాడు. కాగా, ప్రభాస్‌తో ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొరటాల క్లారిటీ ఇచ్చాడు.

దీంతో కొరటాల, ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా అయితే గ్యారంటీగా ఉందని తెలుస్తుంది. గతంలో ప్రభాస్‌కి ‘మిర్చి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన కొరటాల, ఈసారి ప్రభాస్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories