ప్రశాంత్‌ వర్మ మామూలోడివి కాదుగా!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో  ప్రశాంత్ వర్మ ఒకరు . తన ప్రతీ సినిమాతో మంచి వ్యత్యాసం చూపిస్తూ భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లాస్ట్ సినిమాగా టాలీవుడ్ కి భారీ సూపర్ హీరో సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు వస్తున్నట్టుగా పేర్కొన్నాడు.

అయితే ఈ లైనప్ లో చాలా మంది స్టార్స్ కూడా కనిపించబోతున్నట్లు ఇప్పుడు మరో ప్రముఖ హీరో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జాయిన్ అయ్యినట్టుగా తెలిసింది. అయితే ఈ యూనివర్స్ లో తమిళ ప్రముఖ హీరో కార్తీ యాక్ట్‌ చేస్తున్నట్లుగా వర్మ తెలిపాడు.

అయితే తాను కార్తీ గారిని అప్రోచ్ అవ్వడం నిజమే అని ఇక ఆయన ఒప్పుకోవడమే మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు. అలాగే కార్తీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించడంపై సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. మరి ఈ క్రేజీ కాంబో లో ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి. ఇక కార్తీ నటించిన ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా మూవీ “సత్యం సుందరం” ఈ సెప్టెంబర్ 28న మన తెలుగులో విడుదలకు సిద్దంగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories