వాటి కోసం 3డీ స్కెచెస్‌!

నందమూరి బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబోలో ‘అఖండ 2’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా పై చాలా రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతానికి అయితే అఖండ 2 లో నటించే నటీనటుల కోసం బోయపాటి కసరత్తులు చేస్తున్నారు.

పాత్రల గెటప్ అండ్ సెటప్ ల పై ప్రత్యేకంగా 3డి స్కెచెస్ వేయిస్తున్నట్లు టాక్‌ నడుస్తుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను బోయపాటి రాసినట్లు సమాచారం. మరి సంజయ్ దత్ పాత్ర ఎలా ఉండబోతుందో సినిమాలో చూడాల్సిందే. ఇప్పటికే, ‘అఖండ 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక కథ ప్రకారం.. సినిమా మొత్తంగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సన్నివేశాలుంటాయని టాక్‌. అలాగే..హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి ఈ సినిమా పై బాలయ్య అభిమానులు భారీగా అంచనాలు అయితే పెట్టుకున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories