కేసు వెనక్కు తీసుకునే యోచనలో వైసీపీ

అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే తరహాలో ఉంది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి విషయంలో కల్తీ నెయ్యి వాడుతూ.. భక్తుల మనోభావాలతో విశ్వాసాలతో ఆడుకున్నారనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దేవదేవుడి పట్ల జరిగిన ఈ ఘోరఅపచారాన్ని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ మరియు జగన్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారం వెలుగుచూసిన వెంటనే.. అత్యుత్సాహానికి పోయి హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఇప్పుడు వెనక్కు తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ పనిచేస్తే కొంతైనా పరువు కాపాడుకున్నట్టు అవుతుందని.. లేకపోతే.. మరింతగా ఈ నేరంలో కూరుకుపోతామని వారు భయపడుతున్నట్టు తెలుస్తోంది.

లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపనూనె ఆనవాళ్లు కలిసిఉన్నట్టుగా ల్యాబ్ పరిశీలనల్లో తేలిన సంగతిని తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేవుడికి జరిగిన ద్రోహం గురించి ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం మండిపడుతోంది. అయితే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక తొందరపాటు పనిచేసింది. తమ పార్టీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని కూలంకషంగా విచారణ జరిపించాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అంటూ తిరుమల నెయ్యి వివాదంలో మరింత లోతుగా జరిపించాలని వైసీపీ హూకోర్టును కోరిందన్నమాట.

నిజానికి అదనపు విచారణ ఏమీ అవసరం లేనంతగా జరిగిన దారుణాలు ప్రజలకు అర్థమైపోతున్నాయి. టీటీడీ వారి ల్యాబ్ లలో నాణ్యత ప్రమాణాల తనిఖీ పద్ధతిగా జరగలేదనే సంగతి వెలుగులోకి వస్తోంది. అలాగే 320 నుంచి 411 రూపాయల ధరకు కిలో నెయ్యి కాంట్రాక్టు ఓకే చేయడంలోనే లోపం ఉన్నదనే సంగతి కూడా వెలుగుచూస్తోంది. నెయ్యి నాణ్యత నీచంగా ఉన్నదనే సంగతి అన్ని రకాలుగా నిరూపణ అవుతోంది. వైసీపీ వేసిన పిటిషన్ ప్రకారం ‘మరింత లోతైన దర్యాప్తు’ ఈ విషయంలో జరిగితే.. వైసీపీ పాపాలే మరింతగా తేటతెల్లం అవుతాయనే భయం వారికి కలుగుతోంది. అందుకే ఈ పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అధినేత జగన్ ప్రస్తుతం యలహంక ప్యాలెస్ కు వెళ్లి ఉన్నారు. ఆయన దృష్టికి ఈ ఇబ్బందిని తీసుకువెళ్లి.. ఆయన ఆదేశం మేరకు కేసు వెనక్కు తీసుకోవడం గురించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories