ఆదిమూలంపై పెద్దిరెడ్డి కుట్ర బ్యాక్ ఫైర్!

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా ఒక వివాహిత చేసిన ఆరోపణలు అన్నీ ఉత్తుత్తివిగా తేలిపోయాయి. చంద్రబాబునాయుడుకు, లోకేష్ కు లేఖ రాయడంతో పాటు, ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ వివరాలు వెల్లడించిన ఆమె.. పోలీసు కేసు పెట్టారు. చంద్రబాబునాయుడు సీరియస్ కావడంతో.. కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ తక్షణమే సస్పెన్షన్ విధించింది. ఇప్పుడు ఆరోపణలన్నీ ఉత్తివని తేలాయి. కేసు నమోదు అయినప్పుడే.. ఈ బాగోతం వెనుక అదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉన్నట్టుగా పెద్ద ప్రచారం జరిగింది. ఆయన కుట్ర ఇప్పుడు తేలిపోయింది. కేసు విచారణలో కోర్టుకు స్వయంగా హాజరైన సదరు వివాహిత, ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు అన్నీ అవాస్తవమని చెబుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో.. ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేసేది ఎప్పుడో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కోనేటి ఆదిమూలం గత ప్రభుత్వ హయాంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ ఆయనకు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో.. తెలుగుదేశంలో చేరి అక్కడ టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం హవా బీభత్సంగా పనిచేసిన ఎన్నికల్లో గెలిచారు కూడా. ఈ లోగా.. ఆయన కొన్ని నెలలుగా తన మీద అత్యాచారానికి పాల్పడుతున్నారంటూ నియోజకవర్గంలోని ఒక మహిళా కార్యకర్త ఫిర్యాదు చేశారు.

నిజానికి ఆదిమూలం తప్పులేదని, అసలు ఆయనకు టికెట్ రావడాన్నే వ్యతిరేకించిన కొందరు సొంత పార్టీలోని నాయకులు, ఆమెను పురిగొల్పి ఇలాంటి ఫిర్యాదు ఇప్పించారనే ప్రచారం నియోజకవర్గంలో బాగా జరిగింది. అలాగే.. వీరందరికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది. నెలరోజులు కూడా గడవక ముందే ఆ ఫిర్యాదు, ఆరోపణలు అన్నీ డొల్లగా తేలిపోయాయి. సదరు మహిళే స్వయంగా కోర్టులో అఫిడవిట్ వేసింది. ఆయన మీద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర్టునే కోరింది. ఇక ఆదిమూలం సచ్ఛీలుడిగా బయటకు వచ్చినట్టే అని అంతా అనుకుంటున్నారు. కోర్టు తీర్పు రావడం ఇక లాంఛనం అని, కేసు కొట్టేయగానే.. పార్టీ సస్పెన్షన్ కూడా ఎత్తివేస్తుందని అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories