జానీ మాస్టర్‌ పై కేసు!

కొద్దిరోజుల క్రితం మలయాళ సినీ రంగంలో పలువురు నటీమణులు తమ పై లైంగిక ఆరోపణలు గురించి తెలియజేస్తూ సంచలన విషయాలను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు సినీ రంగంలో కూడా లైంగిక ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైగింక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో  అధికారులకు వివరించారు.

దీంతో, జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరి ఈ కేసు పై జానీ మాస్టర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories