మంచి స్పీడుమీదున్నాం …..తెలుసుకదా!

చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.  తన అప్ కమింగ్  సినిమా ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయింది. నెక్స్ట్ ఒక లెన్తీ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ రెడీ అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి కాగా అవుట్‌పుట్‌తో టీమ్‌ కూడా చాలా హ్యాపీగా ఉంది. నెల రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమాలోని మొదటి పాటను కూడా సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నాలపై రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపారు. ఇక షూట్ షెడ్యూల్ పూర్తైన క్రమంలో విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ సెట్స్‌లో ప్లజెంట్ ఎట్మాస్స్పియర్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. హై బడ్జెట్‌తో, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టీం తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories