రెడీ అవ్వండి ఇక!

తలపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇక సినిమాలకు వీడ్కొలు చెబుతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి విజయ్ ఇప్పటి వరకు 68 సినిమాలు చేశాడు. ఆయన ఇటీవల హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుంది.

 ఆయన హీరోగా ఇక సినిమాలు చేయరు అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయన చివరి సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ఇప్పటికే ఓ రాజకీయ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రతి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తుందని ఆయన ఎప్పుడో ప్రకటించారు కూడా.

 2025 జూన్ నాటికి ఆయన తన రాజకీయ జీవితంపై దృష్టి పెట్టేందుకు సినిమాల్లో నటించడం పూర్తిగా ఆపేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన హీరోగా చేసే చివరి సినిమా #తలపతి69  సినిమాకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ శర వేగంగా సాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత, సిమ్రాన్, మమితల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ వారంలోనే ప్రకటన వెలువడుతుందని ప్రచారం కూడా సాగుతోంది. నిజానికి గోట్‌ సినిమానే విజయ్ చివరి సినిమా అని అందరూ భావించారు.  దీంతో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది కానీ వినోద్ సినిమా చివరి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories