జగన్ సంకుచిత బుద్ధి చంద్రబాబులో లేదే!

ఒక్కచాన్స్ అంటే మభ్యపెట్టడంతో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక  దఫా ముఖ్యమంత్రి పదవి దక్కింది. అధికారంఅలోకి వచ్చిన వెంటనే ఆయన విశ్వరూపం చూపించారు. విధ్వంసకపరిపాలన అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి చూపించారు. చంద్రబాబు పాలనలో నిర్మిస్తూ వచ్చిన పేదల ఇళ్లను అయిదేళ్లు పట్టించుకోకుండా, పూర్తి చేయకుండా, లబ్ధిదారులకు అందించకుండా వ్యవహరించారు. అమరావతిని శ్మశానంలాగా మార్చారు.  చంద్రబాబు పాలనలో పనులు చేస్తుండిన కాంట్రాక్టర్లు అందరినీ మార్చేస్తూ తన కావాల్సిన వారికి తిరిగి కాంట్రాక్టులు అప్పగించారు. అలాంటి దందాలకు ఆయన రివర్స్ టెండరింగ్ అని పేరు పెట్టారు. అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు అయిదేళ్లు డబ్బులే ఇవ్వలేదు. అలా.. అనేకానేక సంకుచిత వక్రబుద్ధులను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు. కానీ..రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. జగన్ జమానాలో పనులు పుచ్చుకున్న కాంట్రాక్టర్లు అందరినీ మార్చేసి, వారికి బిల్లులు ఇవ్వకుండా వేధించడం లాంటివి చేయకుండా.. అదే కాంట్రాక్టర్లతో పనులు పూర్తిచేయించే పనిలో పడ్డారు.

పోలవరం ప్రాజెక్టు విషయానికివస్తే.. 2019 దాకా చంద్రబాబునాయుడు  ప్రతి సోమవారం పోలవారం అంటూ పనులను సమీక్షిస్తూ పరుగులు పెట్టించేవారు. జగన్ అధికారంలోకి రాగానే.. హఠాత్తుగా నవయుగ సంస్థతో కాంట్రాక్టును రద్దుచేసేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ పెద్ద డ్రామా ప్రారంభించారు. మేఘా సంస్థకు కాంట్రాక్టులు అప్పగించారు. పనులు చురుగ్గా సాగింది మాత్రం లేదు.

తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. రివర్స్ టెండరింగ్ అనే పదంలో ఉన్న మాయను బయటపెట్టింది. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ సర్కారు సాధించినదేమీ లేదని లెక్కతేల్చింది. ఇటీవల చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల గురించి సమీక్ష జరిపినప్పుడు రివర్స్ టెండరింగ్ ను రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవాలని అనుకున్నారు. కానీ.. తాజాగా పనులు వేగంగా పూర్తి  చేయడానికి, కొత్త టెండర్ల ఆలోచనను వెనక్కు నెట్టి.. మేఘా ద్వారానే అత్యవసరమైన కొన్ని పనులు చేయించాలని నిర్ణయించారు. పోలవరం డ్యాం లో ఎంతో ప్రధానమైన కొత్త డయాఫ్రం వాల్, దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం ఆల్రెడీ మంజూరు చేసిన 12 వేల కోట్ల నుంచి 7 వేల కోట్ల రూపాయలు ఇందుకోసం ముందుగా తీసుకోనున్నారు. అయితే చంద్రబాబు కాంట్రాక్టర్లను మార్చేసే జగన్ తరహా బుద్ధులు చూపించకుండా.. అదే కాంట్రాక్టర్లతో పనులు చేయించడం విశేషం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories