“గేమ్ ఛేంజర్” అప్డేట్ ఫిక్స్‌..!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా, కియారా అద్వానీ హీరోయిన్‌ గా తెలుగు ముద్దుగుమ్మ అంజలి ఫీమేల్‌ లీడ్‌ లో కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ ఇండియా సినిమా గేమ్‌ ఛేంజర్‌.  ఈ సినిమా నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అనే దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 ఇటీవల ఈ వినాయక చవితి కానుకగా ఓ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ నుంచి రావచ్చని టాక్‌ వైరల్ గా మారింది. మరి ఫైనల్ గా ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్న అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది. మరి దీనిపై తాజాగా సంగీత దర్శకుడు థమన్ పోస్ట్ వైరల్ గా మారింది గేమ్ ఛేంజర్ అంటూ వినాయక చవితికి టార్గెట్ పెట్టినట్టుగా ప్రకటించాడు.

సో రేపు గేమ్ ఛేంజర్ నుంచి అనుకున్నట్టుగా ఏదోక అప్డేట్ రాబోతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు దీనికోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories