న్యూయార్క్‌ లో మహేశ్‌ కుటుంబం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన తరువాత సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయని చెప్పుకొవచ్చు. ఇక ఈ సినిమాను గ్లోబల్ సబ్జెక్ట్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నారు.

అయితే, ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్స్‌ని పూర్తిగా మార్చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే జుట్టుతో పాటు గడ్డం కూడా పెంచేస్తూ కనిపిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం ఆయన తన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ వీధులను ఎక్స్‌ప్లోర్ చేస్తూ తన భార్య నమ్రతాతో కలిసి మహేశ్ ఓ ఫోటో దిగాడు.

దీన్ని నమ్రతా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను మహేశ్ అభిమానులు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. బెస్ట్ లుక్‌లో మహేశ్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories