ఏదో అన్ని రివర్సే అవుతున్నాయి!

ఏంటోకానీ ఒక్కోసారి సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్లు చూస్తే ఇది నిజమే కదా అని అనిపిస్తుంది. దేవర సినిమా విషయంలో అనిరుధ్‌ పై వస్తున్న కామెంట్స్‌ చూస్తే..అన్నిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్‌ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఫియర్‌ సాంగ్‌ నుంచి మొదలైన ఈ కామెంట్లు తాజాగా వచ్చిన దావుది సాంగ్‌ వరకు వినిపిస్తునే ఉన్నాయి.

కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ ట్రోల్ చేసేస్తున్నారు. కానీ ఆ తర్వాత రీల్స్‌, హుక్ స్టెప్పులు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో అదే సోషల్ మీడియాను అల్లాడించి బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. అందుకు నిదర్శనం చుట్టమల్లె సాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఓ శ్రీలంక పాటకు కాపీ అని తెగ ట్రోల్స్‌ మొదలుపెట్టారు. కానీ ఏకంగా.. 100 మిలియన్స్ వ్యూస్‌తో ఆ పాట రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక ఇంతకుముందు వచ్చిన ఫియర్ సాంగ్ తీసుకుంటే.. పాటలో అనిరుధ్ డామినేషన్ బాగా కనిపించింది. ఆ సాంగ్‌ లో ఎన్టీఆర్ కంటే అనిరుద్దే ఎక్కువగా కనిపించి వినిపించాడని టాక్‌ నడిచింది. పాట కూడా కాస్త గజిబిజీగా ఉండడంతో.. విమర్శలు బాగా వచ్చాయి. ఇక ఇప్పుడు మాస్ బీట్ అని తారక్‌ అభిమానులు కాస్త కష్టంగానే  ఉన్నప్పటికీ.. దావూదీ పాటను రిసీవ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

పాట సెటప్, ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ఓకే కానీ.. అనిరుధ్ మాత్రం తన పాటను తానే కాపీ కొట్టినట్టుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో విజయ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘హలమితి హబిబో’ సాంగ్‌నే.. అనిరుధ్ దేవరలో పెట్టేశాడని అంటున్నారు. ట్యూనే కాదు.. హలమితి పాటకు దావుది స్టెప్పులను యాడ్ చేస్తే.. ఏది ఒరిజినలో తెలియడం లేదన్నారు.

స్టెప్పులు కూడా హలమితి హబిబో లాగే ఉన్నాయని.. కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ పాట కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. పాట విడుదల అయినప్పటి నుంచి.. ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంటూ.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాబట్టి.. ముందు నెగెటివ్‌గా ట్రెండ్‌ అయినా.. ఈ సాంగ్ కూడా హిట్టే అని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories