దావుడి పాట మీదే అందరి కళ్లు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా,  బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నమోస్ట్‌  అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ  సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో పాటల పై కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.

 మరి ఈ సినిమా నుంచి నేడు విడుదల కానున్న మూడో సాంగ్ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ మూడో సాంగ్ డైరెక్ట్ గా ఫుల్ వీడియో సాంగ్ గా వస్తుంది అన్న టాక్‌ కూడా వినిపిస్తుంది. అందుకే అందరూ దీని గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఆల్రెడీ వచ్చిన పోస్టర్ కానీ ప్రోమో కానీ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక ఈ సాంగ్ కి తారక్ వేసే మాస్ స్టెప్పుల కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఎన్టీఆర్ లాంటి డైనమైట్ కోసం అనిరుద్ ఎలాంటి గీతాన్ని అందించాడో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories