కూలీ రిలీజ్‌ టార్గెట్‌ ఎప్పుడంటే!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇపుడు రెండు చేతుల్లో రెండు సినిమాలతో  బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాల్లో ఒకటి దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న “వేట్టైయన్” ఒకటి కాగా మరో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న భారీ చిత్రం “కూలీ”. మరి ఈ సినిమాని లోకేష్ తన మార్క్ సాలిడ్ క్యాస్టింగ్ తో ప్లాన్ చేస్తుండగా సౌత్ ఇండియా ఆడియెన్స్ లో ఓ రేంజ్ హైప్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తుండగా ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అనేది లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర వంటి స్టార్ లు నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories