పవన్ మీద పడి ఏడుస్తున్నారు.. ఏంటో మరి!

తీవ్రమైన వర్షాల తాకిడికి ఏపీ వ్యాప్తంగా ప్రజాజీవితం అస్తవ్యస్తం అవుతోంది. ప్రత్యేకించి విజయవాడ వాసుల కష్టాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు.. ప్రజలను ఆదుకోవడంలో గరిష్టమైన శ్రద్ధను కనబరుస్తోంది. చంద్రబాబునాయుడు ఒక సాధారణ రెవెన్యూ పోలీసు సహాయక బృందాల్లోని ఉద్యోగిలాగా పగలూ రాత్రీ ప్రజల మధ్యనే ఉంటూ వారికి ధైర్యం చెబుతున్నారు. ఇన్ని పనులు జరుగుతుండగా.. అభినందించడానికి నోరు రాని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. నీలిదళాలు..మధ్యలో పవన్ కల్యాణ్ మీద బురద చల్లడానికి సాహసిస్తున్నాయి.

ఇంత విపత్తు రాష్ట్రాన్ని పలకరిస్తూ ఉంటే.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏమైపోయారు.. అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. సహాయక చర్యల్లో పవన్ ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. కూటమి ఐక్యతలో ముసలం పెట్టడానికి తమ వంతు కుట్ర చేస్తున్నారు.

‘డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇంతటి నిర్లక్ష్యం వహిస్తే ఎలా’ అని ప్రశ్నించగల నైతిక హక్కు నీలిమీడియాకు ఉన్నదా అని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎం పదవి అంటే.. కేవలం కులాల వారీగా పదవులు కట్టబెట్టినట్టు లెక్కకోసం ఇచ్చిన నామ్ కే వాస్తే పదవి. ఆ పదవిలో ఉన్నవారికి కనీస గౌరవ మర్యాదలు కూడా ఉండేవి కాదు. పేరుకు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినప్పటికీ తన సొంత నియోజకవర్గంలో అధికారులు కూడా లెక్క చేయడం లేదని, అంతా రెడ్ల రాజ్యమే నడుస్తున్నదని నారాయణస్వామి ఎన్నిసార్లు ఆవేదన వ్యక్తం చేశారో లెక్కేలేదు.

ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి అనే పదానికి కూడా విలువ ఉంది. ఆ బాధ్యతల్లో పవన్ చక్కగా పనిచేస్తున్నారు. ఆయనకు అధికారమూ, గౌరవమూ కూడా ముఖ్యమంత్రితో దాదాపు సమానంగా ఇస్తున్నారు. దీనిలో పుండుపెట్టడానికి నీలిమీడియా ప్రయత్నిస్తోంది.

పైగా భారీ వర్షాల విషయంలో తొలిరోజే పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులందరికీ విస్తృతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పిలుపు ఇచ్చారు. అభిమానులు కార్యకర్తలు అందరూ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను కూడా మరచిపోయి వరద సహాయక పనుల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయిలో ఉండి పనులు పర్యవేక్షిస్తుండగా.. తాను కూడా క్షేత్రస్థాయిలో ఉండడం చిన్న గందరగోళానికి దారితీస్తుందని పవన్ దూరంగా ఉన్నారు. అలాంటి సమన్వయంతో కూడిన సహాయక చర్యలు జరుగుతుండగా.. వాటిమీద కూడా బురద చల్లడానికి వైసీపీ దళాలు రంధ్రాన్వేషణ చేయడం నీచంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories