విశ్వం టీజర్‌ విడుదల ఎప్పుడంటే!

మాస్‌ యాక్షన్ డైరెక్టర్  శ్రీను వైట్ల డైరెక్షన్‌ లో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే  తాజాగా విశ్వం టీజర్‌ విడుదలకి డేట్ లాక్ అయింది. మంగళవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ విశ్వం సినిమా టీజర్‌ ను అభిమానుల ముందుకు తీసుకుని వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 టీజర్ రిలీజ్ పోస్టర్ సినిమా పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే ఇదొక యాక్షన్-ప్యాక్డ్ మూవీ అని తెలుస్తుంది. మరి ఈ టీజర్ లో విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటిస్తారేమో వేచి చూడాల్సిందే. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ‘విశ్వం’ సినిమాకి మంచి బ‌జ్  క్రియేట్ అయ్యింది. చేత‌న్ భ‌రద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

 ఓ సాలిడ్‌ హిట్ కోసం ఎంతో లా కాలంగా ఎదురు చూస్తున్న డైరెక్టర్‌ శ్రీనువైట్ల, ఈ సినిమాతో ఎలాగైనా సరే ఓ సూపర్‌ హిట్  కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories