నటిగా మాత్రమే కొనసాగడం తనకు నచ్చదని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పారు. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో తాను ఒకరినని కంగనా చెప్పుకొచ్చారు. దర్శకురాలిగా ఉండటం ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ సమయంలో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోవాలనుకున్నా అని కంగనా చెప్పుకొచ్చింది. కంగనా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి చెప్పారు.‘నటిని కావాలనే ఆశతో 2004లో ముంబైకి వచ్చా. ఆరంభంలో గ్యాంగ్‌స్టర్, వోహ లమ్హే వంటి చిత్రాల్లో నటించాను. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సూపర్ మోడల్, గ్యాంగ్‌స్టర్ వంటి ఎన్నో పాత్రల్లో నటించాను. నా నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. అయితే దాదాపు దశాబ్దకాలం పాటు నాకు అవకాశాలు రాలేదు.
ఆఫర్స్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దేశం కూడా వదిలి వెళ్లిపోవాలనుకున్నా’ అని కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న అనేక ఇబ్బందుల గురించి కంగనా చెప్పుకొచ్చింది. నటిగా కంటే దర్శకురాలిగానే తనకు వర్క్ చేయడం బాగుంటుందని కంగనా సమాధానం ఇచ్చారు. ‘నటిగా వర్క్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. నటిగానే కొనసాగడం నాకు నచ్చదు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఓ నటిగా చెప్పాలంటే.. సెట్‌కు సంబంధించి పూర్తి సమాచారం మనకు తెలియదు. దర్శకురాలిగా ఉండటం ఇష్టం.
సెట్‌లో ఏం జరుగుతుంది? అన్నది నేను చెప్పగలను. నాకు పూర్తి అవగాహన ఉంటుంది. నటీనటులుగా ఉండటం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన మంచి దర్శకుల్లో నేనూ ఒకరిని అనుకుంటున్నా. సెట్స్‌లో నాకు నటీనటులంటే చాలా గౌరవం. వారిని ఏంతో జాగ్రత్తగా చూసుకుంటా’ అని బాలీవుడ్ క్వీన్ చెప్పుకొచ్చింది.