ఐదేళ్లపాటు పనులను పూర్తిగా స్తంభింప చేసేసి తన పరిపాలనను పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి తీరు కారణంగా నిర్మాణ భారం అపరిమితంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లను మార్చడం తప్ప జగన్మోహన్ రెడ్డి సర్కారుకు పనులను పర్యవేక్షించడం చేతకాక పోయిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అసలు పూర్తి అవుతుందా లేదా అని ప్రజల్లో భయాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఆగిపోయిన పనుల వ్యవహారాలన్నీ దృష్టిలో ఉంచుకుని కొత్త డిపిఆర్ ను సిద్ధం చేయించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు గతంలో ఆమోదించిన డిపిఆర్లనే చిట్టచివరివిగా అభివర్ణించిన నేపథ్యంలో.. 30 వేల కోట్ల పైచిలుకు అంచనా గేయంతో కొత్త డిపిఆర్ కు కేంద్రం వద్ద ఆమోదం పొందడమే చాలా పెద్ద సంగతి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అనూహ్యమైన విజయాన్ని సాధించారు. కేంద్రం ఎలాంటి బేరాలు లేకుండా పోలవరానికి కొత్త డి పి ఆర్ ను ఆమోదించింది. ప్రస్తుతానికి 12 వేల కోట్ల రూపాయలను రెండు విడతలలో విడుదల చేయడానికి అంగీకరించింది. నిధుల కొరత లేకపోవడంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రాపకం ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సంస్థ ఐదేళ్లపాటు అత్యంత నిరాశాజనకంగా పనులు చేపట్టి పోలవరానికి ఈ దుస్థితి తీసుకువచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు ఆ కాంట్రాక్టర్లను తప్పించి కొత్తగా టెండర్లు పిలవబోతున్నారు. తద్వారా పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.
కొత్త డిపిఆర్ ను ఆమోదించే ముందు ప్రత్యేకంగా కేంద్రం పెట్టిన నిబంధన ఒకే ఒక్కటి! 2027 ప్రారంభంలోగా ప్రస్తుత డిపిఆర్ లోని అన్ని పనులు పూర్తి చేయాలని చేయాలనేదే ఆ నిబంధన. ఆ మేరకు పనులు పూర్తీ అయితే మాత్రమే తర్వాత మిగిలింది నిధులు ఇస్తామంటూ కేంద్రం నిబంధన పెట్టడం పనులు వేగంగా జరగడానికి ప్రేరణ ఇస్తుంది. ప్రస్తుత డిపిఆర్ ద్వారా పోలవరం ప్రాజెక్టు 41 మీటర్ల ఎత్తు నిర్మాణం అవుతుంది. నెల్లూరు 110 టిఎంసిల నీళ్లు నిలువ చేయడం వీలవుతుంది. పూర్తి స్థాయిలో అంటే 194 టీఎంసీలు మీరు నిల్వ చేసేలాగా 45 మీటర్లకు మించిన ఎత్తు ప్రాజెక్టును నిర్మించాలంటే మరో 25 వేల కోట్ల అవసరమవుతాయని, అప్పుడు మరో డిపిఆర్ ని సిద్ధం చేసి కేంద్రం ఆమోదం పొందుతామని చంద్రబాబు ప్రభుత్వం అంటుంది. 2027 లోగా అనుకున్నట్టుగా కచ్చితంగా పనులు జరిగితే.. కేవలం నిధులు సాధించే విషయంలోనే మాత్రమే కాకుండా నిర్మాణ పనులు పూర్తి చేసే విషయంలో కూడా చంద్రబాబు ఘనవిజయం సాధించినట్లుగా భావించవచ్చు.