అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అని సామెత. ఇలాంటి అల్ప బుద్ధుల విషయంలో మరింతగా పేరు మోసిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి ది. ఆయన పేదవాడి కడుపు నింపడానికి అన్నం పెట్టరు.. కావాలంటే తన దోపిడీకి అనుకూలంగా పేదలు లిక్కర్ షాపులకు వచ్చిన మద్యం తాగడానికి ఇంటింటికి కొంత డబ్బులు పంచి పెడతారు. అన్నం పెట్టే అలవాటు లేని జగన్మోహన్ రెడ్డి.. పెట్టే చేతిని నరికేయడానికి కూడా వెనుకాడే రకం కాదు అని తాజాగా నిరూపించుకుంటున్నారు. అన్న కాంటీన్ల నిర్వహణ బాగోలేదంటూ తప్పుడు ప్రచారంతో ఇప్పుడు వైసిపి దళాలు నీచత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.
అన్న కాంటీన్ లలో చేతులు కడగటానికి ఉద్దేశించిన చోట కొంచెం నీళ్ళు నిల్వ అయ్యాయి. ఆ నీళ్ళతోనే తిన్న ప్లేట్లు కడుగుతున్నారు అంటూ వైసిపి దళాలు, సాక్షి మీడియా ఒక వీడియోతో తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.
వాస్తవానికి జరిగింది ఏంటంటే.. చేతులు కడిగే చోట నిల్వ ఉన్న నీళ్ళలో వైసిపి దుర్మార్గులు తాము తిన్న ప్లేట్ వదిలేశారు. అక్కడి సిబ్బంది వచ్చి నీళ్లలోంచి ప్లేటు బయటకు తీస్తుండగా దానిని వీడియో షూట్ చేశారు. ఆ నీళ్లలోనే ప్లేట్లో కడుగుతున్నారంటూ ఒక తప్పుడు ప్రచారం ప్రారంభించారు. తాను ముఖ్యమంత్రి కాగానే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ల పథకాన్ని పూర్తిగా రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వాటిని తిరిగి ప్రారంభించిన తర్వాత వాటి మీద ప్రజలలో అపోహలు కలిగించడానికి ఇలాంటి నీచమైన ప్రచారం మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది.
అన్న క్యాంటీన్ల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ఈ వ్యవహారాన్ని ఖండించారు కూడా. ప్రజలు అంటే దుర్మార్గమైన ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది.