బాలయ్య బాబు షోకి కింగ్‌!

 నందమూరి  నటసింహం బాలయ్య బాబు హీరోగా  దర్శకుడు బాబీతో తన కెరీర్  లో 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య సినిమాలు థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య బాబుతో  మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ప్లాన్ చేసిన సెన్సేషనల్ టాక్ షో “అన్ స్టాప్పబుల్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రికార్డు వ్యూస్ తో అదరగొట్టే ఈ షో ఇపుడు నాల్గవ సీజన్లోకి అడుగుపెట్టింది. అయితే నాల్గో సీజన్లో మరింతమంది బిగ్ స్టార్స్ కనిపించనుండగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ బజ్‌ లో అక్కినేని హీరో కింగ్ నాగార్జున అయితే బాలయ్య షోలో సందడి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం నాగ్ కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ నటిస్తున్న “కుబేర” సినిమాలో ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

అందులో నాగ్‌ పాత్ర పవర్‌ ఫుల్‌ పోలీసు అధికారిగా ఉండనున్నట్లు తెలుస్తుంది. కాసేపు కింగ్‌ నే అందులో విలన్ అని..కీలక పాత్ర ఆయనదే అని టాక్‌.

Related Posts

Comments

spot_img

Recent Stories