తంగలాన్ 2 గురించి చెప్పిసిన చియాన్‌!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ముందుకు దూసుకు పోతుంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా హీరో విక్రమ్ మాట్లాడుతూ, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందరూ తంగలాన్ ను ఆదరిస్తున్న తీరు పట్ల సంతోషం గా ఉంది. జ్ఞానవేల్ రాజా, రంజిత్, నేను కలిసి పార్ట్ గురించి చర్చించాం. త్వరలో పార్ట్ 2 ఉండబోతుందని విక్రమ్ చెప్పుకొచ్చారు. పార్ట్ 2 ను కన్ఫర్మ్ చేయడం తో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories