జగనన్న కోటరీ కుట్రలకు ఎదురుదెబ్బ!

ప్రజలు ఓడించినా, కేవలం 11 సీట్లలో మాత్రం గెలిపించి బుద్ధి చెప్పినా.. జగనన్న కోటరీ మాత్రం కుట్రలు మానుకోవడం లేదు.  చంద్రబాబును బద్నాం చేయాలనే కుట్రతో తాజాగా కోర్టులో దాఖలు అయిన ఒక కేసు సంగతి గమనిస్తే ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. ప్రచార కాంక్షతో దాఖలు అయిన కేసుకు తగినట్టుగానే.. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా కనిపిస్తున్నాయి.

చంద్రబాబు తదితరుల మీద గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమోదు చేసిన అవినీతి కేసుల విచారణ సిఐడి చేతినుండి సిబిఐ, ఈడీ లకు అప్పగించాలని కోరుతూ ఒక ప్రైవేటు వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  జగన్ సర్కారు పెట్టిన కేసుల్లో నిందితుడు అయిన చంద్రబాబు, ఇప్పుడు విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం లేదని, అందువల్ల విచారణ సంస్థను మార్చాలని పిటిషన్ లో కోరారు.
గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను సమీక్షించకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలువరించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. గత ప్రభుత్వం పెట్టిన కేసులు.. రాజకీయ దురుద్దేశంతో పెట్టారా? లేదా? తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణ విషయంలో అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ దే నని, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కూడా కోర్టు గుర్తుచేసింది.

నిజానికి ఈ పిటిషన్ ను గమనిస్తే అత్యుత్సాహంతో దాఖలైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే.. వేర్వేరు సందర్భాల్లో.. గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులను సమీక్షిస్తామని ప్రస్తుత సీఎం, హోం మంత్రి అన్నారంటూ పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యల ఆధారంగా ఈ పిటిషన్ దాఖలు అయింది. నిజానికి అలాంటి సమీక్ష జరపడమూ.. ఏదైనా అలాంటి ఒక ముఖ్యమైన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుని ఉంటే.. ఆ తర్వాత ఈ పిటిషన్ కోర్టులో వేసి ఉంటే గనుక.. దీనికి కాస్త విలువ పెరిగేది. అలాకాకుండా.. ఇప్పుడే వేయడం వలన, కోర్టు వ్యాఖ్యలను గమనిస్తే.. జగన్ సర్కారు పెట్టిన వేధింపు కేసులను సమీక్షించి, ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్టే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories