ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ ను ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నీల్ ప్రభాస్ సలార్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా దేవర కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు దేవర షూటింగ్ చివరి దశకు చేరింది. మరోవైపు వార్2 కూడా కంప్లీట్ చేయబోతున్నాడు తారక్. ఇక ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో.. సలార్ 2ని పక్కకు పెట్టేశాడు నీల్. దీంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఆగష్టు 9న అంటే శుక్రవారమే రామనాయడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. అయితే.. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. ఈ ఓపెనింగ్ సెర్మనీకి మీడియా కవరేజ్ కూడా ఉండదని సమాచారం.
ఎన్టీఆర్ 31 ప్రారంభ కార్యక్రమం సాదాసీదాగా జరుగబోతుందని సమాచారం. అయితే.. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు విడుదల చేయనున్నారని సమాచారం.
కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు.. సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే..కేజీయఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పైగా ఎన్టీఆర్ తన అభిమాన హీరో కావడమే కాదు, ఈ సినిమా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. మామూలుగానే నీల్ తన హీరోలను నెక్స్ట్ లెవల్ అనేలా చూపిస్తుంటాడు. అలాంటిది ఎన్టీఆర్‌ను ఇంకే రేంజ్లో ఎలివేట్ చేస్తాడనే ఆసక్తితో ఉన్నారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.