చైతూ బాటలోనే ఆయన హీరోయిన్‌ కూడా!

శ్రావణ మాసం మొదలైంది. ఇక ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడే కనిపిస్తోంది. దీంతో కొందరు సెలెబ్రిటీలు కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి వైవాహిక జీవితానికి స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే  టాలీవుడ్ కు చెందిన స్టార్ ఫ్యామిలీ అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఇక ఇదే దారిలో మరో  హీరోయిన్ ఉన్నట్టు సమాచారం.

సౌత్ బ్యూటీ, తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. వచ్చే ఏడాది ప్రియా భవాని వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు చెప్పి తన అభిమానులకి షాకిచ్చారు. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ప్రియా పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి గురించి నెట్టింట చర్చ మొదలైంది.

టాలీవుడ్ లో హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన దూత సిరీస్‌లో తన నటనతో మెప్పించి హీరోయిన్ ప్రియా భవాని తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. చెన్నైకు చెందిన ప్రియా భవానీశంకర్‌.. ‘మేయాద మాన్’తో నటిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. 2023లో విడుదలైన ‘కళ్యాణం కమనీయం’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచింది. దాని తర్వాత తెలుగులో గోపీచంద్ తో భీమా, విశాల్‌తో రత్నం సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది.

తాజాగా వచ్చిన భారతీయడు 2లో కూడా కీలక పాత్ర చేసింది. ఇటీవల ఆమె పెళ్లిపై పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ‘రాజవేల్ అనే వ్యక్తితో సినిమాలోకి రాకముందే రిలేషన్ లో ఉన్నా. మేమిద్దరం చాలాకాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. సరైన సమయం దొరకడం లేదు. వచ్చే ఏడాది తప్పకుండా వివాహం చేసుకుంటాము అంటూ ప్రియా తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories