మరో కొత్త చాప్టర్‌ తో రాబోతున్న కేజీఎఫ్‌ స్టార్‌!

కన్నడ స్టార్ హీరో యశ్‌ నటించిన కేజీఎఫ్ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ లో వచ్చిన ఈ సినిమా  కన్నడ సినిమా స్థాయిని పెంచి, వరల్డ్ మార్కెట్ లో కన్నడ సినిమాకు డోర్స్ ఓపెన్ చేసిందని చెప్పుకోవచ్చు. రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ ఇండియాలోనే అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా టాప్ 5లో ఒకటిగా ఉంది. 2022లో వచ్చిన ఈ సినిమా తర్వాత యశ్‌ మరే ఇతర సినిమాలోనూ యాక్ట్‌ చేయలేదు.

ఆ మధ్య టాక్సిక్ సినిమాను ప్రకటించాడు యశ్‌. కానీ షూటింగ్ మొదలు పెట్టలేదు. యశ్‌ అభిమానులు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది, టాక్సిక్ సినిమా షూటింగ్ గురువారం పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టాడు. అందుకు సంబంధించి షూట్‌లో మొదటి రోజు ఫోటో ని బయటకు వదిలారు చిత్ర బృందం. మొదటి షెడ్యూల్ ను బెంగళూరు, తర్వాత ముంబైలలో షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని ఎక్కువ భాగం లండన్‌లో జరగనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో యశ్‌ సరసన తమిళ భామ నయనతార, బాలీవుడ్ నాయకి కైరా అద్వానీ కథానాయికలుగా నటించనున్నారు.

మలయాళ నటుడు టామ్ చాకో, హ్యూమా ఖురేషి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories