టాలీవుడ్ లో షాక్, మిరపకాయ్ సినిమాల తరువాత మాస్ మహారాజ రవితే, దర్శకుడు హరీష్ శంకర్ కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్ సినిమా. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ను డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఎలా చూపించారు? ఎందుకు మిరపకాయ్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు గ్యాప్ వచ్చింది అనే విషయాల పై హరీష్ అభిమానులు, ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ కామెంట్స్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.
తన ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత, సెకండ్ అవకాశం ఇవ్వడమే గొప్ప. వీడే చిత్రం అప్పటి నుండి రవితేజ గారితో నా జర్నీ మొదలు అయ్యింది. ఈ చిత్రం తర్వాత నా ఆటోగ్రాఫ్, షాక్, మిరపకాయ్. అంటే నా లైఫ్ లో 10 – 12 ఏళ్లు రవితేజ గారి సెట్స్ లోనే ఉన్నా. సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే, మొత్తం నా లైఫ్ లో మేజర్ పార్ట్ ఆయనతో ఉన్నా.
అలా చెప్పే కన్నా, అతను నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అని చెప్పాలి. షాక్ ఫ్లాప్ అయ్యాక, పిలిచి మిరపకాయ్ అవకాశం ఇచ్చారు. నాకొక దారి వేసాడు. ఆ దారిలో వెళ్లిపోతున్నా నేను. ఒక సక్సెస్ ఇచ్చి వదిలారు. ఇక నా లైఫ్ నేను చూసుకోవాలి అనే చిన్న దాంతో తప్ప, ఏ రోజు కూడా మిరపకాయ్ నుండి మిస్టర్ బచ్చన్ కి ఉన్న గ్యాప్ లో మేమిద్దరం కలవని నెల లేదు, వెళ్ళని హాలీడే లేదు.
ఎప్పుడూ సినిమా గురించి మాట్లాడుకోలేదు. మా బంధం, సినిమాలకి మించి ఉంటుంది. అంతే తప్ప వేరే రీజన్ ఏమి లేదు.మిస్టర్ బచ్చన్ లో నా మాస్ మహారాజ ను ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎలా చూడాలి అని అనుకుంటున్నారో, అంతకు 100 టైమ్స్ చూపించాను అని చాలా గర్వంగా చెప్తాను అంటూ హరీష్ చెప్పుకొచ్చారు.