బాలయ్య, రామ్ పోతినేని లపై మాస్ మల్టీస్టారర్ లోడింగ్?

మన టాలీవుడ్ స్టార్‌ హీరోలలో  నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు.  కాగా ప్రెజెంట్ యంగ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కూడా మంచి మాస్ ఫేమ్‌  ఆడియెన్స్ లో ఏర్పడింది.. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల పర్వం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ ఇద్దరి కలయికలో అయితే సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ పడబోతునట్టుగా ఇప్పుడు క్రేజీ టాక్‌ చక్కర్లు కొడుతుంది.

మరి ఈ చిత్రాన్ని మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నట్లుగా టాక్. అంతేకాకుండా ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పని చేస్తారని కూడా టాక్‌. ఇక ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ నిజం అయితే మాస్ ఆడియెన్స్ కి వీరి కాంబో  క్రేజీ ట్రీట్ ని డెఫినెట్ గా అందిస్తుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు కొల్లి బాబీతో తన 109వ సినిమాలో బిజీగా ఉండగా రామ్, దర్శకుడు పూరీ జగన్నాధ్ తో చేసిన మాస్ సీక్వెల్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్” విడుదలకు సిద్దంగా ఉన్నాడు..

Related Posts

Comments

spot_img

Recent Stories