ఏపీకి మంచి జరిగితే కాంగ్రెస్ ఓర్వలేదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే నిజమైన అర్థంతో ప్రభుత్వం ఎలా పెర్ఫార్మ్ చేయగలదో ప్రజలందరికీ అర్థమవుతోంది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య మంచి సమన్వయం కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి మంచిగా నిధులు తీసుకురాగలుగుతున్నారు. పోలవరం పూర్తికి సంబంధించి కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంది. అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు ప్రకటించింది. అవుటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ప్యాకేజీలు రకరకాలుగా సాయం అందిస్తోంది. ఈ వ్యవహారం చూస్తోంటే కాంగ్రెసుకు కన్ను కుడుతున్నట్టుగా, ఏపీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. 25 ఎంపీ సీట్లున్న ఏపీలో కూటమి బలంగా పాతుకుపోతుందేమోననే భయం కాంగ్రెసులో కనిపిస్తున్నట్టుగా ఉంది.

ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలు చెల్లని చెక్కులే అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ఎద్దేవా చేస్తున్నారు. ఏపీతో పాటు బీహార్ కు ఇచ్చిన హామీలేవీ కూడా మరి కొన్నేళ్లలో రూపుదాల్చే అవకాశం లేదని శకునాలు పలుకుతున్నారు. ఈలోగా కేంద్రంలో ప్రభుత్వం మారిపోతుందని కూడా జోస్యం చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో మూతపడుతున్న బ్యాంకు పేరుతో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కుల లాంటివి అని జైరాం అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసింది. తెలంగాణ రాష్ట్రం తమకు దక్కుతుందనే ఆశతో అత్యంత అమానవీయమైన రీతిలో రాష్ట్ర విభజన చేపట్టింది. విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్తి కష్టాల్లో అడుక్కుతినే పరిస్థితిని కల్పించింది.  విభజన బిల్లును పార్లమెంటులో పెట్టిన సందర్భంగా.. పదేళ్ల పాటు ప్రత్యేకహోదా హామీని ఇచ్చి, ఆ విషయాన్ని చట్టంలో పొందుపరచకుండా ఏపీకి ఎన్నటికీ మాయలేని ద్రోహం తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది ఇప్పుడు హోదాకు అవకాశం లేకపోయినా.. తతిమ్మా అన్ని రకాలుగా ఏపీని ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వాలు, డబుల్ ఇంజిన్ సర్కారు  రూపంలో పనిచేస్తూంటే.. వారికి కంటగింపుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ బుద్ధిని కాంగ్రెస్ మానుకోకపోతే.. ఇతర రాష్ట్రాల్లో కూడా మంటగలిసిపోతుందని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories