రవితేజ సినిమాలో యంగ్‌ హీరో గెస్ట్‌ రోల్‌!

రవితేజ తాజా చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. ఈ సినిమా బాలీవుడ్‌  రైడ్‌ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న మూడో హ్యాట్రిక్ మూవీ మిస్టర్ బచ్చన్. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పై రవితేజ  అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన విడుడల చేయనున్నట్టు నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాల మధ్య పోటీగా విడుదల కానుంది ఈ మూవీ మిస్టర్ బచ్చన్.

ఈ సినిమాలో ఓ యంగ్ హీరో అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అతడెవరో కాదు DJ టిల్లు, టిల్లు -2 వంటి సూపర్ హిట్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ. ప్రస్తుతం రవితేజ, సిద్దు జొన్నలగడ్డ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ, సిద్దు మధ్య వచ్చే సన్నివేశాలు మిస్టర్ బచ్చన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త ట్రీట్ ఇచ్చేందుకు దర్శకుడు హారిష్ శంకర్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మరోవైపు సిద్దు జొన్నలగడ్డ హీరోగా పీపుల్స్ మీడియా ‘తెలుసు కదా’ అనే సినిమాని నిర్మిస్తోంది. ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ శ్రీమతి నీరజ కోన ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నారు. మాస్ మహారాజ, టిల్లు మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories