బిచ్చగాడిగా అపర కుబేరుడు…ఎందుకలా!

సూపర్‌ స్టార్‌ ధనుష్‌ సార్‌ చిత్రంతో స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో సూపర్‌ హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.  ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు ధనుష్‌. జాతీయ అవార్డు డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌ లో  ఓ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా సినిమాగా ఈ మూవీ శరవేగంగా షూటింగ్  జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు మేకర్స్.

ఆదివారం ధనుష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల  ధనుష్ లుక్ ను విడుదల చేస్తూ ఓ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ధనుష్ మాసిన గడ్డంతో బిచ్చగాడి లుక్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

ధనుష్‌ ప్రామాణికమైన నటనను పోస్టర్ లో స్పష్టంగా ప్రదర్శించాడు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనే విషయం తెలిసిందే. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ వేరే లెవల్లో ఉంటుందనే చెప్పాలి. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ సినిమాని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ మూవీని ఈ ఏడాదిలో థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories