డబుల్‌ ఇస్మార్ట్‌ డిజిటల్‌ పార్ట్‌ నర్ ఎవరో తెలుసా?

రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌ లో  రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ను ఆగస్ట్ 15, 2024 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

గతంలో సూపర్ హిట్ సాధించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఇది సీక్వెల్ గా రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబందించిన ఓటిటి రైట్స్ పై ఓ క్లారిటీ వచ్చింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది. కేవలం సౌత్ భాషల హక్కులనే ఈ సినిమా 33 కోట్ల రూపాయలకి దక్కించుకుంది. హిందీ ఓటిటి రైట్స్ పై ఇంకా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories