నాకు అర్హతలేకున్నా ప్రయారిటీ ఇవ్వాల్సిందే!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ దినం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అసహ్యకరమైన , వివాదాస్పదమైన ప్రవర్తన తో తన గౌరవం పోగొట్టుకున్నారు. తన అర్హతకు మించిన ప్రోటోకాల్ మర్యాదలు కావాలని, . ఆయన పోలీసులతో గొడవ పెట్టుకోవడం.. రాద్ధాంతం చేయడం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు చీప్ గా కనిపిస్తోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నరు ప్రసంగం ఉంటుంది. గవర్నరు వచ్చే సందర్భంలో సభా గౌరవాన్ని కాపాడాల్సిన కనీస బాధ్యత ఒక దఫా ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటుంది. కానీ ఆయన ఆ బాధ్యతను విస్మరించారు. రెచ్చిపోయి ప్రవర్తించారు.

గవర్నరు రాక సందర్భంగా అసెంబ్లీ మెయిన్ గేటు గుండా సాధారణ ఎమ్మెల్యేలు ఎవ్వరినీ లోనికి రానివ్వలేదు. వారందరూ కూడా నాలుగోనెంబరు గేటు బయట కారు దిగి, లోనికి నడుచుకుంటూ వెళ్లాలనేది నిబంధన. అయితే ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ కు మాత్రం.. ఆయన కారు లోపలవరకు వెళ్లవచ్చునని, అయితే 4వ నెంబరు గేటు ద్వారా మాత్రమే అని పోలీసులు చెప్పారు. కానీ జగన్ తనను మెయిన్ గేటు గుండానే లోపలకు అనుమతించాలని.. పట్టుబట్టడం విశేషం. దానికోసం ఆయన పోలీసులను రకరకాలుగా బెదిరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తానని అన్నారు. ఎన్ని చేసినా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మెట్టు దిగలేదు. ఈలోగా గవర్నరు వచ్చేస్తున్నారనే సమాచారంతో జగన్ చివరికి 4వ గేటు గుండానే లోపలకు వెళ్లాల్సి వచ్చింది.

తనను ప్రజలు అంత నీచంగా ఓడిస్తే, తన అర్హతకు మించిన ప్రోటోకాల్ మర్యాదల కోసం జగన్ పట్టుపట్టడం చాలా చీప్ గా ఉన్నదని ప్రజలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత కుబేరుడైనా కావొచ్చు గాక.. కానీ ఆయనకు దక్కే మర్యాద, గౌరవం అనేవి కేవలం ప్రజలు ప్రసాదించే భిక్ష. అలాంటిది ప్రజలు ఛీకొట్టి మామూలు ఎమ్మెల్యేగా మాత్రమే ఉండమని ఆదేశిస్తే.. ఆయన తనకు అదనపు మర్యాదలు కోరుకోవడం ఏ రకంగా కరెక్టు?

జగన్ ఇవాళ గొడవ చేసి ఉండొచ్చు. కానీ.. తాను ఒక మామూలు ఎమ్మెల్యేని మాత్రమే.. తన పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలందరూ గేటు దగ్గర దిగి నడుచుకుంటూ వస్తే తాను కూడా వారితో కలిసి దిగి నడిచి వెళ్తేనే ప్రజలు తన వినయాన్ని గుర్తిస్తారని తెలుసుకోవాలి. నిబంధనలను మీరి చంద్రబాబు సర్కారు జగన్ మామూలు ఎమ్మెల్యే అయినా, ఆయన ఒక్కరి వాహనాన్ని 4వ గేటు నుంచి లోపలకు పంపారు. కానీ.. ఇలాంటి గొడవలు చేస్తే ముందు ముందు ఆ మర్యాదను కూడా ఇవ్వరు. 

Related Posts

Comments

spot_img

Recent Stories