లావు మాట నిజమే.. జగన్ నిర్వాకం దేశానికంతా తెలియాలి!

మంచివాడు ఒక రాష్ట్రానికి పాలకుడు అయితే అతని మంచి తనం గురించి పరిపాలన సామర్థ్యం గురించి ఆటోమేటిగ్గా ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు.. దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా తెలుస్తుంటుంది. ఒక దుర్మార్గుడు పాలకుడు అయితే.. తనకు చిత్తమొచ్చిన రీతిలో పాలన సాగిస్తూ.. తన దుర్మార్గాలకు అందమైన ముసుగులు తొడిగి ప్రపంచాన్ని మభ్యపెడుతూ గడిపేస్తే అప్పుడేం చేయాలి. అలాంటి దుర్మార్గమైన పాలన గురించి, అలాంటి దుర్మార్గుడు గురించి దేశం మొత్తానికి కూడా తెలియజెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లోక్ సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అదే మాట అంటున్నారు.
నిజానికి లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ద్వారా సాధించే విషయంలో ఇతర రాష్ట్రాలు అడ్డుపడకుండా ఉండాలంటే.. జగన్ అయిదేళ్ల అరాచక పాలన గురించి వారందరికీ అవగాహన ఉండాలని అంటున్నారు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతటి అర్థిక సంక్షోభం లోకి నెట్టివేశారో.. దేశంలోని అన్ని పార్టీలకు తెలియాలని అంటున్నారు. ‘ఆ వాస్తవాలు తెలిస్తేనే మేం రాష్ట్రానికి కోరుతున్న సాయానికి అందరూ మద్దతు పలుకుతారు. మన ఆర్థిక దుస్థితి అన్ని రాష్ట్రాలకు తెలిసినప్పుడు రాష్ట్రానికి కేంద్రం కాస్త ఉదారంగా సాయం చేసినా ఎవరూ అడ్డుకోరు’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా అది నిజం.

ఇవాళ జగన్.. ఏపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించి, దేశంలోని అన్ని పార్టీలకు చెప్పి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలని కూడా పిలుపు ఇచ్చారు. అయితే అందులో ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనం తప్ప మరొకటి లేదు. కానీ.. లావు శ్రీకృష్ణదేవరాయలు మాటల్లో అలాకాదు. జగన్ యొక్క అరాచక పరిపాలన గురించి, ఏపీని సర్వనాశనం చేసిన తీరుగురించి దేశంలోని అన్ని పార్టీలకు తెలియజెప్పడం మన రాష్ట్రానికి అవసరం. అందువల్ల రాష్ట్రప్రయోజనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువుగా నెరవేరుతాయి.

అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. కేవలం దేశంలోని అన్ని పార్టీలకు మాత్రమే కాదు.. దేశప్రజలందరికీ కూడా తెలియడం అవసరం. ఎందుకంటే.. ఒక దుర్మార్గుడు పాలకుడు అయితే.. ఆ రాష్ట్రం ఎంత సర్వతోముఖవినాశనానికి గురవుతుందో దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి దానివల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉంటారు అని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories