త్రివిక్రమ్‌-బన్నీ సినిమా అలాంటిదే..!

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం మీద అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు ఓ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి వాళ్ళు ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుంది.

నిజానికి పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్ కి వాయిదా పడడంతో బన్నీ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని ఆయన వివరించారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు డీల్ చేయని ఒక సబ్జెక్టును డీల్ చేసేందుకు రెడీ అయ్యారని, ఇది పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందని తెలిపారు .చాలా భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నాం కాబట్టి అల్లు అరవింద్ అలాగే నిర్మాత నాగ వంశీ ఇప్పటినుంచి డబ్బులు వేటలో పడ్డారని ఫైనాన్షియరులను పట్టుకుంటున్నారని  వివరించారు.

ఈ సినిమా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ చేయడానికి దాదాపు ఏడాది నుంచి ఏడాదిన్నర పడుతుందని ఈ సందర్భంగా బన్నీ వాసు వివరించారు. త్రివిక్రమ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ చేయగలరని అల్లు అర్జున్ నమ్మారని అందుకే సుమారు రెండేళ్ల నుంచి ఈ కాన్సెప్ట్ మీద వాళ్ళు ట్రావెల్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందని  అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories