విశ్వంభ‌ర’ షూట్ పై తాజా సమాచారం!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’. ఈ మూవీ  ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను బింబిసార ఫేం వ‌శిష్ఠ మ‌ల్లిడి తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి సోషియో ఫాంటెసీ సినిమా గా ఇది రాబోతుంది. ఇక ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ ప్రేక్ష‌కుల‌ను కచ్చితంగా థ్రిల్ చేస్తుందనే ధీమా మూవీ మేకర్స్‌ వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ తాజా వార్త సినీ వర్గాల్లో వినిపిస్తోంది.  ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్‌ అయిపోయిందట. కొన్ని పాట‌లు, క్లైమాక్స్ కు సంబంధించిన ఎపిక్ ఫైట్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్న‌ట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా నుండి ఓ సాలిడ్ టీజ‌ర్ ను కూడా రెడీ చేస్తుంది చిత్ర బృందం.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న ఈ టీజ‌ర్ ను విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, ఎంఎం.కీర‌వాణి సంగీతం కూర్చుతున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోండ‌గా, సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని విడుదల చేసేందుకు మూవీ మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories