నిన్నటి వరకు యావత్ ప్రపంచం మొత్తం కల్కి మేనియా నడిచిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ ఏ సినిమా గురించి ఈ ఎదురు చూపులు అంటే కచ్చితంగా అందరి నోట నుంచి వచ్చే ఒకే ఒక్క మాట రాజమౌళి, మహేష్ బాబు సినిమా అనే చెబుతారు. టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది వీరి సినిమానే.
అయితే ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ ఇంకో పక్క రాజమౌళి అండ్ టీం లొకేషన్స్ సీన్స్ డిజైన్ విషయాల్లో కసరత్తులు చేస్తుండగా అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా మొదలు కావడానికే చాలా సమయం పట్టేటట్లు కనిపిస్తుంది.
నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఈ సినిమా మొదలు అవుతుంది అనుకున్న సినిమా నెక్స్ట్ అక్టోబర్ కి వెళ్ళింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమా ఇక్కడ నుంచి కూడా లేట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ సినిమా మొదలయ్యేది ఈ ఏడాది చివరలోనే అని తెలుస్తుంది. సో మరికొంత సమయాన్ని మేకర్స్ తీసుకోనున్నారని టాక్. ఇక ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ ఒక క్రేజీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా అలాగే రాజమౌళి మార్క్ స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.