తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శుభవార్త!

తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మొత్తం కూటమి పార్టీల నాయకులందరికీ కూడా ఆనందం కలిగించే ఒక శుభవార్తను ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పై పెట్టిన అక్రమ కేసులను మూడు నెలల నుంచి ఏడాదిలోగా తొలగిస్తామని పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత దుర్మార్గమైన ఆలోచనలతో ప్రతిపక్షాలకు చెందిన వారందరి మీద కూడా విచ్చలవిడిగా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో అనేకమంది కీలక కార్యకర్తల మీద నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి వేధించే ప్రయత్నం చేశారు. వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. అబద్ధపు అత్యాచారయత్నం కేసులు కూడా పెట్టించారు. వేల మంది తెదేపా కార్యకర్తలు గత ఐదేళ్ల కాలంలో తమ సొంత ఊరిలో ఉండకుండా అరెస్టు భయంతో అజ్ఞాత జీవితంలో ఊర్లు మారుతూ గడుపుతూ వచ్చారంటే అతిశయోక్తి కాదు 

అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గత ఐదేళ్లలో పెట్టిన ఆక్రమ కేసులు అన్నింటినీ కూడా తొలగిస్తామని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పడం అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజానికి అన్ని కేసులను ఒకే తీరుగా తొలగించడం సాధ్యం కాదు. అందుకే మూడు నెలల నుంచి ఏడాదిలోగా కేసులు తొలగిస్తామని పార్టీ నాయకుడు చెబుతున్నారు. కార్యకర్తలను నాయకులను కాపాడుకోవడం పార్టీ బాధ్యత అని ఆయన అంటున్నారు. 

దీనితోపాటు 2014 -19 మధ్యకాలంలో కాంట్రాక్టు పనులు చేసి జగన్ పాలన కాలంలో మొత్తం బిల్లులు పొందలేకపోయిన.. వారందరికీ న్యాయం చేస్తామని కూడా పల్లా శ్రీనివాసరావు చెబుతున్నారు. ఇలాంటి ప్రకటనతో తెలుగుదేశం నాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవు. అవుతున్నాయి.

నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా పార్టీ సారథి కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహరాం.. ఆరునెలల్లోగా మొత్తం పూర్తవుతుందని.. పార్టీకోసం కష్టపడిన అందరికీ చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories