ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఇండస్ట్రీలో మెగాస్టార్, అక్కినేని,దగ్గుబాటి వారసులు ఎంట్రీ ఇవ్వడం హిట్లు వారి ఖాతాల్లో వేసుకోవడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. ఇక మిగిలింది నందమూరి నటసింహం బాలయ్య బాబు కుమారుడు మోక్షఙనే …
ఈ యంగ్ లయన్ ఎంట్రీ కోసం అభిమానుల తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా గత నాలుగైదు ఏళ్లుగా నందమూరి వారసుడి ఏంట్రీపై పలు వార్తలు అడపాదడపా వినపడుతున్నాయి. ఆ డైరక్టర్ దర్శకత్వంలో.. ఈ నిర్మాత లాంఛ్ చేయబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఏ ఏడాదికేడాది మోక్షు ఎంట్రీ పై ఊహగానాలు వినిపించాయి.
ఇదిలా ఉండగా గత కొన్ని ఏళ్లుగా ఈ కుర్ర హీరో అన్నిరకాల విద్యలో శిక్షణ తీసుకొంటున్నాడు. అటు డాన్స్, ఇటు ఫైట్స్, గుర్రపు స్వారీ, స్విమ్మింగ్ తో పాటు ప్రముఖ గురువుల వద్ద నటన కోచింగ్ లో నైపుణ్యం సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. కాగా మోక్షు ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. బరువు తగ్గి లుక్స్ మార్చుకొని పర్ఫేక్ట్ హీరో మెటీరియల్ కి కావలసిన క్వాలిఫికేషన్స్ అన్నిటిని సాధించాడు మోక్షు. తాజా సమాచారం మేరకు ఇటీవల హనుమాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అరంగేట్రం చేసుకుందుకు అన్ని పనులు చక చక జరుగుతున్నాయని, కథ చర్చలు ముగిశాయని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మంచి రోజు చూసి ప్రకటిస్తారని సమాచారం.
ఈ చిత్రాన్ని NBK బ్యానర్ పై బాలయ్య రెండవ కుమార్తె శ్రీమతి మతుకుమిల్లి తేజస్విని నిర్మించనున్నారు. మోక్షు ఎంట్రీ వార్తల నేపథ్యంలో ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.