వైసీపీ భూ అక్రమాల గురించి వివరాలివ్వండి..చంద్రబాబు ఆదేశం!

ఏపీలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, విశాఖలో దసపల్లా వంటి విలువైన స్థలాల కబ్జా, అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుందని అధికారులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, టీజీ భరత్‌తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఏపీ భూ హక్కు చట్టం, రీసర్వే, విద్యుత్‌ సంస్థలు, వైఎస్సార్సీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపు, పేదలకు సెంటు స్థలాలు, రెవెన్యూ వ్యవహారాల్లో ఆ పార్టీ నాయకుల జోక్యం వంటి అంశాలపై అధికారులు రూపొందించిన నివేదికను చంద్రబాబు పరిశీలించారు.

 అప్పట్లో జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, అప్పటి నేతలే చేసినట్టుగా ఉంది. కానీ వాటిలో ఎక్కడా తమ ప్రమేయమే లేనట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదిక సమగ్రంగా లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలతో మరింత లోతుగా తయారు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories